మూడో టెస్టుకు హర్షిత్‌‌ రాణా

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌‌తో మూడో టెస్టుకు పేసర్‌‌ హర్షిత్‌‌ రాణాను ఇండియా టీమ్‌‌లోకి తీసుకున్నారు. బుధవారం ముంబైలో అతను జట్టుతో కలవనున్నాడు. అయితే రిజర్వ్‌‌ ప్లేయర్‌‌గా ఉంటాడా?  మెంబర్‌‌గానా? అనే దానిపై క్లారిటీ లేదు. గతంలో రిజర్వ్‌‌ ప్లేయర్‌‌గా టీమ్‌‌తో పాటే కొనసాగినా రెండో టెస్ట్‌‌కు ముందు అతన్ని రిలీజ్‌‌ చేశారు. దీంతో అస్సాంతో జరిగిన రంజీ మ్యాచ్‌‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన రాణా ఏడు వికెట్లు తీశాడు. ఇక ఆస్ట్రేలియా టూర్‌‌ నేపథ్యంలో పేసర్ల వర్క్‌‌లోడ్‌‌ను నిశితంగా పరిశీలిస్తున్న టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కివీస్‌‌తో మూడో టెస్ట్‌‌కు బుమ్రాకు రెస్ట్‌‌ ఇచ్చే చాన్స్‌‌ ఉంది. 

అదే జరిగితే రాణా టెస్ట్‌‌ల్లో అరంగేట్రం చేయొచ్చు. కివీస్‌‌తో మూడో టెస్ట్‌‌కు రాణా సిద్ధంగా ఉన్నాడని ఢిల్లీ కోచ్‌‌ శరణ్‌‌దీప్‌‌ సింగ్‌‌ సంకేతాలిచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్‌‌ మాజీ కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ మూడో టెస్ట్‌‌కు కూడా అందుబాటులో ఉండటం లేదు. గాయం నుంచి అతను పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ప్రస్తుతం కేన్‌‌లో మంచి పురోగతి కనిపిస్తోందని చెప్పిన కోచ్‌‌ గ్యారీ స్టెడ్‌‌ ఉన్న పళంగా బరిలోకి దిగే అవకాశం లేదన్నాడు.