IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లు అద్భుతం.. చేజారిన క్యాచ్‌ను పట్టేశారు

పెర్త్ టెస్టులో అద్భుతమైన క్యాచ్ ఒకటి నమోదయింది. దాదాపు చేజారిందనుకున్న క్యాచ్ ను ఆసీస్ ఆటగాళ్లు ఒడిసి పట్టారు. ఇన్నింగ్స్ 47 ఓవర్ నాలుగో బంతిని  ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్ లెంగ్త్ బాల్ వేశాడు. ఈ బంతిని హర్షిత్ రానా కట్ చేయగా. అది స్లిప్ లో క్యాచ్ గా వెళ్ళింది. ఈ బంతిని మెక్‌స్వీనీ ఒక చేత్తో డైవ్ చేసి పట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలో బంతి చేతిలో పడినట్టే పడి జారింది. అక్కడే స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న మార్నస్ లబు షేన్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. దీంతో హర్షిత్ 7 పరుగులకే ఔటయ్యాడు.  

ALSO READ | IND vs AUS: నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు.. 150 పరుగులకే కుప్పకూలిన భారత్

రెప్పపాటులో జరిగిన ఈ సంఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ సూపర్ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది. తొలి ఇన్నింగ్స్ లో బౌలింగ్ లో విజృంభించి భారత్ ను ఆస్ట్రేలియా కేవలం 150 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ప్రస్తుతం 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రాకు 3 వికెట్లు తీసుకున్నాడు. హర్షిత్ రానాకు ఒక వికెట్ దక్కింది.