బ్రూక్‌‌‌‌కు టాప్ ర్యాంక్‌‌‌‌

దుబాయ్‌‌‌‌: ఇంగ్లండ్ స్టార్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ జో రూట్ ఐసీసీ టెస్టు బ్యాటర్లలో నంబర్ వన్ ర్యాంక్‌‌‌‌ కోల్పోయాడు. సూపర్ ఫామ్‌‌‌‌లో దూసుకెళ్తున్న అతని తోటి ఆటగాడు హ్యారీ బ్రూక్‌‌‌‌ నయా నంబర్ వన్‌‌‌‌గా నిలిచాడు. మరోవైపు ఇండియా స్పీడ్‌‌‌‌స్టర్ జస్‌‌‌‌ప్రీత్ బుమ్రా, స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర జడేజా బుధవారం తాజా జాబితాలో బౌలింగ్‌‌‌‌, ఆల్‌‌‌‌రౌండర్లలో తమ అగ్రస్థానాలను నిలబెట్టుకున్నారు.

 గత వారం న్యూజిలాండ్‌‌‌‌పై దంచికొట్టి తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఎనిమిదో సెంచరీ సాధించిన 25 ఏండ్ల బ్రూక్‌‌‌‌ 898 రేటింగ్ పాయింట్లతో  ఈఏడాది జులై  నుంచి అగ్రస్థానంలో ఉన్న  జో రూట్‌‌‌‌ను (897) రెండో స్థానానికి నెట్టి టాప్ ర్యాంక్‌‌‌‌లోకి వచ్చాడు. బౌలర్ల జాబితాలో బుమ్రా (890) టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లోనే ఉండగా.. జడేజా (415) ఆల్‌‌‌‌రౌండర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.