ఇంగ్లాండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ టెస్టుల్లో టాప్ ర్యాంక్ కు చేరుకున్నాడు. సహచర ఆటగాడు జో రూట్ ను వెనక్కి నెట్టి బ్రూక్ అగ్ర స్థానానికి దూసుకెళ్లాడు. రూట్, బ్రూక్ మధ్య కేవలం ఒక్క రేటింగ్ పాయింట్ మాత్రమే ఉంది. బ్రూక్ ఖాతాలో 898 రేటింగ్ పాయింట్స్ ఉంటే.. రూట్ ఖాతాలో 897 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. న్యూజిలాండ్ తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో బ్రూక్ అద్భుతమైన ఆట తీరుతో చెలరేగాడు. బ్రూక్ మూడు ఇన్నింగ్స్‌లలో 116.3 సగటుతో 349 పరుగులతో ఇప్పటివరకు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ALSO READ | Team India: ఆసీస్‌తో మూడో టెస్ట్ .. బ్రిస్బేన్ చేరుకున్న టీమిండియా
హామిల్టన్‌లో జరిగిన మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 171 పరుగులతో భారీ సెంచరీ చేసిన బ్రూక్.. ఆ తర్వాత వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్స్‌లో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో123.. రెండో ఇన్నింగ్స్ లో 55 పరుగులు చేశాడు. భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నాలుగో ర్యాంక్ కు పడిపోయాడు. అడిలైడ్ లో భారత్ పై భారీ సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్ ఐదో ర్యాంక్ కు చేరుకున్నాడు. భారత ఆటగాళ్లలో జైశ్వాల్ నాలుగో స్థానాల్లో ఉండగా పంత్ 9 స్థానంలో కొనసాగుతున్నాడు.
బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా (883) టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంక్ కు చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడా (872) రెండో స్థానంలో ఉన్నాడు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు. టీమ్స్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా తొలి ర్యాంక్ లో.. భారత్ రెండో ర్యాంక్ లో ఉన్నాయి.
The new No. 1 in the ICC Test batting rankings: Harry Brook ?? pic.twitter.com/3fcGzUlcmi
— ESPNcricinfo (@ESPNcricinfo) December 11, 2024