ఇంగ్లాండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సెంచరీతో ఇంగ్లాండ్ మూడో వన్డేలో విజయం సాధించింది. దీంతో 5 వన్డేల సిరీస్ లో ఆశలు సజీవంగా ఉంచుకుంది. సిరీస్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించాడు. 94 బంతుల్లో 13 ఫోర్లు.. 2 సిక్సర్లతో 110 పరుగులు చేసి వన్డే కెరీర్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు. బట్లర్ గైర్హాజరీతో ఇంగ్లాండ్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన బ్రూక్..తన తొలి సెంచరీతో రికార్డ్ పట్టేశాడు. అతి చిన్న వయసులో ఇంగ్లాండ్ తరపున వన్డేల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
25 సంవత్సరాల 215 రోజుల వయస్సులో బ్రూక్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో సూపర్ ఫామ్ తో దూసుకెళ్తున్న ఈ యువ ప్లేయర్ వన్డేల్లోనో అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఇక తొలి రెండు వన్డేలు గెలిచిన ఆస్ట్రేలియా.. మూడో వన్డేలో ఓడిపోయింది. మంగళవారం (సెప్టెంబర్ 24) దీంతో సిరీస్ లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ కు ముందు వరుసగా 14 వన్డే మ్యాచ్ ల్లో గెలిచి ఆసీస్ జైత్రయాత్రకు ఇంగ్లాండ్ బ్రేక్ వేసింది.
Also Read :- ఐదేళ్ల తర్వాత తొలిసారి.. రంజీ ట్రోఫీ స్క్వాడ్‌లో కోహ్లీ
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. వికెట్ కీపర్ అలెక్స్ కారీ కేవలం 65 బంతుల్లోనే అజేయంగా 77 పరుగులు చేశాడు. సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ 60 పరుగులతో రాణించాడు. మాక్స్వెల్ (30) ఆరోన్ హార్డీ (44) పర్వాలేదనిపించారు. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 37.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 స్కోర్ చేసింది. బ్రూక్ (110) సెంచరీకి తోడు జాక్స్ (84) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ సమయంలో వర్షం రావడంతో డక్ వర్త్ లూయిస్ స్కోరింగ్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్‌ను 46 పరుగుల తేడాతో విజేతగా ప్రకటించారు.
Harry Brook became the youngest England skipper to smash a century in ODIs, ending Australia's 14-match winning streak ????????#HarryBrook #ENGvAUS #ODIs #Sportskeeda pic.twitter.com/93Ap1bpbFw
— Sportskeeda (@Sportskeeda) September 25, 2024