సొంతగడ్డపై పాక్ కష్టాలు కొనసాగుతున్నాయి. వారు తీసుకున్న గోతిలో వారే పడినట్టు ఉంది. ఫ్లాట్ పిచ్ పై ఇంగ్లాండ్ దంచికొడుతుంది. ముల్తాన్ వేదికగా జరుగుతున్న టెస్టులో ఇంగ్లాండ్ 800 పరుగుల దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ నాలుగో రోజు రెండో సెషన్ లో 4 వికెట్ల నష్టానికి 777 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 223 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ చేసినప్పటికీ పాక్ డేంజర్ జోన్ లో పడింది.
బ్రూక్, రూట్ అదరహో:
ఇంగ్లాండ్ యువ ప్లేయర్ హ్యారీ బ్రూక్, రూట్ నాలుగో రోజు కూడా తమ జోరును చూపించారు. బ్రూక్ ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాదేశాడు. 310 బంతుల్లోనే 300 మార్క్ అందుకోవడం విశేషం. అతని ఇన్నింగ్స్ లో 28 ఫోర్లు.. 3 సిక్సర్లు ఉన్నాయి. మరో ఎండ్ లో రూట్ 262 పరుగుల భారీ సెంచరీ చేసి ఔటయ్యాడు. ఈ ద్వయం పాక్ బౌలర్లను అలవోకగా ఆడేశారు. వన్డే స్టయిల్లో బ్యాటింగ్ చేసి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. చాలా కూల్ గా పరుగులు బాదేశారు. ఏదో గల్లీ క్రికెట్ లో ఆడేసినట్టు భారీ సెంచరీలతో సత్తా చాటారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు ఏకంగా 452 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Also Read:-అత్యుత్సాహంతో పరువు పోగొట్టుకున్న పరాగ్
చేతిలో 6 వికెట్లు ఉండడంతో ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ భారీ ఆధిక్యం రాబట్టడం గ్యారంటీ. ఓపెనర్ క్రాలీ (78) డకెట్(84) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్ (151), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (102) అఘా సల్మాన్ (104) సెంచరీలతో సత్తా చాటడంతో తొలి ఇన్నింగ్స్ లో 556 పరుగుల భారీ స్కోర్ చేసింది.
Remarkable. Outstanding. Sensational.
— England's Barmy Army ???????? (@TheBarmyArmy) October 10, 2024
Harry Brook brings up his triple-century in Multan ???
? An unbelievable achievement from an incredible player and person. #PAKvENG pic.twitter.com/d4n11MezjW