కొత్త కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్

కొత్త కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్

భారత మహిళల క్రికెట్‌ జట్టు కొత్త కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ని బీసీసీఐ ఎంపిక చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కు మిథాలీ రాజ్  రిటైర్మెంట్ ప్రకటించడంతో అమె స్ధానంలో హర్మన్ ప్రీత్ కౌర్ ను కెప్టెన్ గా నియమిస్తూ  బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.  త్వరలో శ్రీలంకతో జరగబోయే వన్డే, టీ20 సిరీస్  లకు జట్టును  ప్రకటిస్తూ హర్మన్ ప్రీత్ కౌర్ కు పగ్గాలు అప్పగించింది. శ్రీలంక పర్యటనలో భాగంగా టీంఇండియా  మూడు టీ20  మ్యాచ్ లు(జూన్ 23, 25, 27), 3  వన్డేలు(జూలై 1, 4, 7) ఆడనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరిచనుంది. 

భారత టీ20  జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన ( వైస్ కెప్టెన్‌), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా ,  ఎస్.మేఘన, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గయక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), పూజనా వస్త్రాకర్ సింగ్, రేణుకా సింగ్, జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్.

భారత వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన ( వైస్ కెప్టెన్‌), షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికెట్), ఎస్ మేఘన, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గయాక్వాడ్, సిమ్రాన్ బహదూర్, రిచా ఘోష్ (వికె), పూజానా వస్త్రాకర్, మేఘనా వస్త్రాకర్ సింగ్, రేణుకా సింగ్, తానియా భాటియా (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్.

మరిన్ని వార్తలు