INDW vs NZW: రనౌటైనా ఇయ్యలే.. కివీస్‌కు అనుకూలంగా అంపైర్లు

భారీ అంచనాలతో బరిలోకి దిగిన  ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌.. టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో తేలిపోయింది. స్టార్లంతా అంచనాలు అందుకోవడంలో విఫలం కావడంతో.. శుక్రవారం జరిగిన గ్రూప్‌‌‌‌–ఎ తొలి మ్యాచ్‌‌‌‌లో టీమిండియా 58 రన్స్‌‌‌‌ తేడాతో న్యూజిలాండ్ చేతిలో కంగుతిన్నది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో అమెలియా కెర్‌‌‌‌‌‌‌‌ రనౌటైనా అంపైర్లు ఇవ్వకపోవడం వివాదాస్పదమైంది.

14వ ఓవర్ చివరి బాల్‌‌‌‌ను కెర్‌‌‌‌‌‌‌‌ లాంగాఫ్‌‌‌‌ మీదుగా ఆడి సింగిల్‌‌‌‌ తీసింది. మరో బ్యాటర్‌‌‌‌‌‌‌‌ సోఫీ డివైన్‌‌‌‌ ఆలస్యంగా రెండో రన్‌‌‌‌ కోసం పిలిచింది. అప్పటికే బాల్‌‌‌‌ను చేతిలోకి తీసుకున్న హర్మన్‌‌‌‌ప్రీత్ వేగంగా త్రో చేయగా.. కీపర్‌‌‌‌‌‌‌‌ రిచా కెర్‌‌‌‌‌‌‌‌ను రనౌట్‌‌‌‌ చేసింది.  ఈ టైమ్‌‌‌‌లో  మెయిన్ అంపైర్‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌ దీప్తికి ఆమె క్యాప్‌‌‌‌ను అందిస్తుండగా..  లెగ్ అంపైర్‌‌‌‌‌‌‌‌ తన షూ లేస్ కట్టుకుంటూ కనిపించింది. ఇండియా ప్లేయర్లు సెలబ్రేట్‌‌‌‌ చేసుకోగా... పెవిలియన్‌‌‌‌ వైపు వెళ్తున్న కెర్‌‌‌‌‌‌‌‌ను  ఫోర్త్  అంపైర్‌‌‌‌‌‌‌‌  ఆపింది.  రెండో రన్‌‌‌‌ను ఆలస్యంగా మొదలు పెట్టడంతో దీన్ని డెడ్‌‌‌‌ బాల్‌‌‌‌ గా, కెర్‌‌‌‌‌‌‌‌ను నాటౌట్‌‌‌‌గా ఇవ్వడంతో ఇండియా ప్లేయర్లంతా షాకయ్యారు.

కెప్టెన్ హర్మన్‌‌‌‌, వైస్ కెప్టెన్ మంధాన అంపైర్లతో వాదనకు దిగారు. బౌండ్రీ లైన్ అవతల ఇండియా కోచ్ అన్మోల్‌‌‌‌ ముజుందార్‌‌‌‌‌‌‌‌ కూడా ఫోర్త్ అంపైర్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడాడు. దాంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. సింగిల్ పూర్తవగానే అంపైర్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌ పూర్తయినట్టు ప్రకటించిందని నచ్చచెప్పినట్టు తెలుస్తోంది. ఇండియా ప్లేయర్లు నిరసన వ్యక్తం చేసినా చివరికి దాన్ని ఫెయిర్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌గానే ఇచ్చి సింగిల్ మాత్రమే అనుమతిస్తున్నట్టు తెలిపారు. దాంతో బతికిపోయిన కెర్‌‌‌‌‌‌‌‌ తర్వాతి ఓవర్లోనే రేణుక బౌలింగ్‌‌‌‌లో ఔటవడం గమనార్హం.