న్యూఢిల్లీ : అమెరికన్ బైక్ కంపెనీ హార్లీ డేవిడ్‌సన్ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘లైవ్‌వైర్’ పేరుతో దీన్ని ప్రవేశపెట్టింది. 15.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో రూపొందిన ఈ బైక్.. 78 కేడబ్ల్యూ పవర్ అవుట్‌పుట్‌ను, 116 ఎన్‌ఎం పీక్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది 235 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. లైవ్‌వైర్‌తో పాటు బీఎస్ 6 ఎమిషన్ నార్మ్స్‌తో మరో కొత్త బైక్ స్ట్రీట్ 750ని కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.5.47 లక్షల వరకు ఉంది. కంపెనీ ఇండియాలో ఆపరేషన్స్ ప్రారంభించి పదేళ్లు పూర్తయిందని హార్లే డేవిడ్‌సన్ ఇండియా ఎండీ సంజీవ్ రాజశేఖరన్ అన్నారు.
