యాసంగి పంటకు నీళ్లివ్వండి .. మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కు మాజీమంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు లెటర్‌‌‌‌‌‌‌‌

సిద్దిపేట, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మూడు రిజర్వాయర్ల నుంచి యాసంగి పంటకు నీరు అందించాలని మాజీమంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు కోరారు. ఈ మేరకు బుధవారం ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌  ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డికి లెటర్‌‌‌‌‌‌‌‌ రాశారు. గత మూడేండ్లుగా సిద్దిపేట జిల్లాలోని రైతులకు గోదావరి జలాలు అందించామన్నారు. జిల్లాలోని మూడు రిజర్వాయర్ల ద్వారా సిద్దిపేట, మెదక్, యాదాద్రి, జనగామ జిల్లాలకు సాగు, తాగునీరు అందించాలని లేఖలో కోరారు. ప్రస్తుతం మల్లన్న సాగర్‌‌‌‌‌‌‌‌లో 19.03, కొండ పోచమ్మ సాగర్‌‌‌‌‌‌‌‌లో 9.5, రంగనాయక సాగర్‌‌‌‌‌‌‌‌లో 2.57, అన్నపూర్ణ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌లో 3.21టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

 మిడ్‌‌‌‌‌‌‌‌మానేరులో 27టీఎంసీల నీళ్లు ఉన్నందున వాటిని సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లకు లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ చేసి పూర్తి స్థాయిలో సాగు నీటిని అందించాలని కోరారు. రైతలు యాసంగి సాగుకు సమాయత్తం అవుతున్నందున నీటి విడుదలకు భరోసా ఇవ్వాలన్నారు. నీటి విడుదలపై ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని లెటర్‌‌‌‌‌‌‌‌లో విజ్ఞప్తి చేశారు.