స్కిల్ వర్శిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి : హరీశ్ రావు

దేశానికి దశదిశ చూపించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని  అన్నారు హరీశ్ రావు .  పేద కుటుంబంలో పుట్టి అసామాన్యంగా ఎదిగారని చెప్పారు.  అసెంబ్లీలో మన్మోహన్ సంతాప తీర్మానం సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు..  శాసన మండలిలోనూ మన్మోహన్ కు నివాళి అర్పిస్తే బాగుండేదన్నారు .  మాతృదేశం కోసం ఎన్నో అవకాశాలు వదులుకున్నారని తెలిపారు. మన్మోహన్ ను దేశ రాజకీయాల్లోకి తెచ్చింది పీవీ అని అన్నారు.  పీవీ నమ్మకాన్ని మన్మోహన్ వమ్ము చేయలేదన్నారు.  ఆర్థిక మంత్రిగా మన్మోహన్ ప్రసంగం అత్యుత్తమమని కొనియాడారు.  లైసెన్స్ రాజ్, పర్మిట్ రాజ్ లకు మన్మోహన్ సింగ్ స్వస్తి పలికారని గుర్తు చేశారు.  హైదరాబాద్ లో  స్కిల్ వర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టాలన్నారు హరీశ్.

దేశ చరిత్రపై మన్మోహన్ సింగ్ చెరగని సంతకం చేశారని అన్నారు హరీశ్ రావు.   కేసీఆర్ హైదరాబాద్ లో  పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  మన పీవీ,మన టీవీ అన్న విధంగా  గౌరవించుకున్నాం.  మన్మోహన్ పదవుల కోసం చూడలేదు.  పదవులే మన్మోహన్ ను  వెతుక్కుంటూ వచ్చాయి. పీవీ, మన్మోహన్ ఇద్దరు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు.  కాంగ్రెస్ ఓటమికి పీవీ సంస్కరణలే కారణమని ఆంటోనీ రిపోర్టు ఇచ్చింది.  ఓటమికి మన్మోహన్ ను బాధ్యున్ని చేసినా వెనక్కి తగ్గలేదు.  లాలూను రక్షించడానికి కాంగ్రెస్ సర్కార్ ఆర్డినెన్స్ తెచ్చింది.  ఇబ్బందులు ఎదురైనా మన్మోహన్ మౌనమే వహించారు. మన్మోహన్ హయాంలోనే తెలంగాణ వచ్చిందని అన్నారు హరీశ్ రావు.