బెనిఫిట్​ షోకు అనుమతి ఎవరిచ్చిన్రు? : హరీశ్​ రావు

హైదరాబాద్, వెలుగు: చట్టం.. ఒక్క అల్లు అర్జున్​ విషయంలోనే కాకుండా.. రేవంత్​ రెడ్డి అండ్​ బ్రదర్స్​ విషయంలోనూ స్పందించాలని హరీశ్​ రావు అన్నారు. ‘‘అసలు బెనిఫిట్​ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమాను ప్రదర్శించింది ఎవరు?”అని ఆయన ప్రశ్నించారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు.

ఆ ఘటనకు రాష్ట్ర సర్కారే అసలు కారణమని, చర్యలు తీసుకోవాల్సింది కాంగ్రెస్​ ప్రభుత్వంపైనేనని పేర్కొన్నారు. అలాగే, మాజీ సర్పంచ్​ఆత్మహత్యకు కారణమైన సీఎం రేవంత్​ రెడ్డి బ్రదర్స్​ను ఎందుకు అరెస్ట్​ చేయడం లేదని ప్రశ్నించారు