పవన్ కు బిగ్ షాక్: హరిరామ జోగయ్య కీలక నిర్ణయం... కాపు సంక్షేమ సేన రద్దు..!

మాజీ మంత్రి సీనియర్ నాయకుడు చేగొండి హరిరామజోగయ్య కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను స్థాపించిన కాపు సంక్షేమ సేనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మీదట రాజకీయాలకు కూడా దూరంగా ఉంటానని, రాజకీయ విశ్లేషకుడిగా కొనసాగుతానని అన్నారు. గత కొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వరుస లేఖలు రాస్తూ వార్తల్లో నిలుస్తున్నారు జోగయ్య. ఇటీవల జరిగిన టీడీపీ, జనసేన ఉమ్మడి సభలో మాట్లాడుతూ సలహాలు ఇచ్చే పెద్దలు తనకు దూరంగా ఉండాలని పవన్ చేసిన వ్యాఖ్యలు తనని ఉద్దేశించినట్లుగానే భావించి కౌంటర్ ఇచ్చాడు జోగయ్య.

ALSO READ :- రైతు కృషి: తమలాపాకుల సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు

జనసేన పీఏసీ మెంబర్ గా ఉన్న హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ ఇటీవల పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాడు. ఈ క్రమంలో జోగయ్య ఈ నిర్ణయం తీసుకోవటం చర్చనీయాంశం అయ్యింది. కొడుకు లాగే తాను కూడా వైసీపీలో చేరుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవలే వైసీపీలో చేరటం ఇందుకు బలం చేకూరుస్తోంది. పవన్ కళ్యాణ్ కు కాపు సామాజిక వర్గం నుండి ఇంకెన్ని షాకులు తగులుతాయన్నది వేచి చూడాలి.