హరి హర వీరమల్లు మరో కొత్త డేట్‌తో వచ్చేశాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఈ మూవీ మొత్తానికి థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధమైంది. శనివారం (జూన్21న) మేకర్స్ తమ సోషల్ మీడియా ద్వారా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ పాన్ ఇండియా మూవీని జులై 24న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
'ఒకరు అధికారం కోసం పోరాడుతారు. ఒకరు ధర్మం కోసం పోరాడుతారు. అందులోనే వారసత్వాల ఘర్షణ ప్రారంభమవుతుంది. సత్యం, విశ్వాసం మరియు స్వేచ్ఛ కోసం యుద్ధానికి సాక్ష్యమివ్వండి. జులై 24న థియేటర్లలో హరి హర వీరమల్లు అడుగెట్టబోతుంది. ప్రేక్షకుల రాకకోసం ఒక చారిత్రక అనుభవం వేచి ఉందిని' మేకర్స్ పోస్టులో వెల్లడించారు.
One fights for Power.
— Hari Hara Veera Mallu (@HHVMFilm) June 21, 2025
One fights for Dharma.
The clash of legacies begins. ?
Witness the Battle for truth, faith and freedom ?? ??????? ????????? ???? ??, ???? ⚔️?
A Historic Experience Awaits ❤️#HariHaraVeeraMallu ?#HHVMonJuly24th #HHVM… pic.twitter.com/WHLUZWtavA
హరిహర వీరమల్లు సినిమా ఏ క్షణాన మొదలైందో కానీ.. తరుచూ ఆగిపోతూ వస్తూనే ఉంది. షూటింగ్ మొదట్లో.. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అయిపోవడం.. డైరెక్టర్ క్రిష్ తప్పుకోవడం.. ఆ తర్వాత కథలో మార్పులు, షూటింగ్ జాప్యం ఇలా అష్టకష్టాలు దాటుకొని ఎట్టకేలకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
►ALSO READ | Kuberaa Collection: తొలిరోజే దుమ్ముదులిపిన కుబేర
కనీసం, ఆ తర్వాత ఐనా .. రిలీజ్ కు వచ్చిందా..? అంటే అది లేదు. మే అని, జూన్ అని.. ఇలా తరుచూ మరోతేదికి మారుతూనే ఉంది. ఇక వచ్చేస్తుంది.. అనేలోపే సీజీ వర్క్ డిలే వల్ల జూన్ 12నుంచి కూడా తప్పుకుంది. ఇక ఎట్టకేలకు జులై 24కి వీరమళ్లు ఆగమనానికి దారి తథ్యం అయింది.
హిస్టరికల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీని క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. ఏఎం రత్నం సమర్పిస్తున్న ఈ సినిమాను దయాకర్ రావు ప్రొడ్యూస్ చేశాడు. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. బాబీ డియోల్, నాజర్, నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహిలాంటి వాళ్లు నటించారు. కీరవాణి సంగీత దర్శకత్వం వహించగా.. మనోజ్ పరహంస, వీఎస్ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందించారు.
