టార్గెట్ 223 పరుగులు..జట్టు స్కోర్ 16 ఓవర్లలో 152 పరుగులు.. గెలవాలంటే నాలుగు ఓవర్లలో 71 పరుగులు చేయాలి. ఈ దశలో జట్టు ఓటమి ఖాయమని ఎవరైనా అనుకుంటారు. ఓవర్ కు దాదాపు 18 పరుగులు చేయడం అంటే ఏ జట్టుకైనా కష్టమే. అయితే భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో 30 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్ లో భాగంగా చివరి బంతికి తమిళ నాడుపై బరోడా విజయం సాధించింది.
గుర్జప్‌నీత్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 17 వ ఓవర్లో పాండ్య నాలుగు సిక్సర్లు.. ఒక ఫోర్ బాదాడు. ఈ ఓవర్లో ఒక నో బాల్ కూడా రావడంతో మొత్తం 30 పరుగులు వచ్చాయి. దీంతో సమీకరణం ఒక్క సారిగా 18 బంతుల్లో 36 పరుగులకు చేరింది. ఈ మ్యాచ్ లో 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసుకున్న పాండ్య మొత్తం 30 బంతుల్లో 60 పరుగులు చేశాడు. పాండ్య ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. పాండ్యతో పాటు పూనియా కీలక ఇన్నింగ్స్ ఆడడంతో పాటు 20 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేజ్ చేసింది.
ALSO READ | IND vs AUS: తొలి టెస్టులో ఓటమి.. ఆల్ రౌండర్‌ను జట్టులో చేర్చిన ఆస్ట్రేలియా
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన తమిళనాడు 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. శంకర్ (44)తో పాటు ఎన్ జగదీశన్ (57), బాబా ఇంద్రజిత్ (25), బూపతి కుమార్ (28), కెప్టెన్ షారుక్ ఖాన్ (39) జట్టు భారీ స్కోర్ సాధించడంలో భాగమయ్యారు. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య 3 ఓవర్లలో 44 పరుగులు సమర్పించుకుంటున్నాడు.
In case you missed it, Hardik Pandya went 6⃣,6⃣,6⃣,4⃣ in a single over in the Syed Mushtaq Ali trophy last night where Baroda chased down TN's 221/6 ???pic.twitter.com/NOkLo6pW9t
— Cricbuzz (@cricbuzz) November 28, 2024