IND vs BAN 2024: హార్దిక్ హార్ట్ టచింగ్ సీన్.. గ్రౌండ్‌లోనే అభిమానితో పాండ్య సెల్ఫీ

ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మూడో టీ20 భారత్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఏకంగా 133 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తన మంచి మనసుతో అభిమాని మనసు గెలుచుకున్నాడు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాండ్య బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. అయితే అక్కడే ఉన్న ఒక చిన్న పిల్లాడు సెల్ఫీ కావాలని అడిగాడు. 

హార్దిక్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ అభిమాని కోరిక తీర్చాడు. గ్రౌండ్ లోపల నించొని అభిమానితో సెల్ఫీ దిగాడు. పిల్లాడు కింద కూర్చొని సెల్ఫీ తీసుకుంటుంటే హార్దిక్ వంగి మరీ సెల్ఫీ ఇవ్వడం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ హార్దిక్ మంచి మనసును పొగిడేస్తున్నారు. సాధారణంగా ప్లేయర్స్ గ్రౌండ్ లోనే ఉంది సెల్ఫీ ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ హార్దిక్ మాత్రం తన పనితో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. 

ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో సత్తా చాటిన పాండ్య 18 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు.. నాలుగు సిక్సర్లు ఉన్నాయి. అంతకముందు జరిగిన రెండు టీ20ల్లోనూ పాండ్య ఆల్ రౌండ్ షో తో అదరగొట్టాడు. దీంతో అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.