ఐపీఎల్ 2025లో అత్యంత పటిష్టమైన జట్లలో ముంబై టాప్ లో అంటుంది. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా లాంటి ఆటగాళ్లతో దుర్బేధ్యంగా కనిపిస్తుంది. అయితే ఈ జట్టులో భారత యువ ఓపెనర్ ఇషాన్ కిషాన్ ను ఆ జట్టు వదిలేసుకుంది. కిషాన్ 2018 నుంచి 2024 వరకు వరుసగా ఏడేళ్ల పాటు ముంబై విజయాల్లో తన వంతు పాత్ర పోషించినా.. అతడిని రిటైన్ చేసుకోలేదు. కనీసం మెగా ఆక్షన్ లో అయినా అతన్ని కొనడానికి ఆసక్తి చూపించలేదు. 7 ఏళ్ళ తర్వాత ముంబై జట్టుకు కిషాన్ దూరమవ్వడంతో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య ఎమోషనల్ అయ్యాడు.
ఇషాన్ కిషాన్ గురించి మాట్లాడుతూ హార్దిక్ పాండ్య ఇలా అన్నాడు. " కిషాన్ ను మేము నిలబెట్టుకోలేకపోయాం. వేలంలో అతన్ని తిరిగి పొందడం చాలా కష్టం అని మాకు తెలుసు. కిషాన్ డ్రెస్సింగ్ రూమ్ ను ఎప్పుడూ సందడిగా ఉంచుతాడు. జట్టులో అందరితో త్వరగా కలిసిపోతాడు. మేమంతా నిన్ను మిస్ అవుతున్నాం. మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం". అని పాండ్య అన్నాడు. ముంబై ఇండియన్స్ మెగా ఆక్షన్ కు ముందు బుమ్రాకు రూ. 18 కోట్లు, హార్దిక్ పాండ్యకు రూ.16.35 కోట్లు, సూర్య కుమార్ యాదవ్ కు రూ.16.35 కోట్లు, రోహిత్ శర్మ రూ. 16 కోట్లు.. తిలక్ వర్మ కు రూ. 8 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. హార్దిక్ పాండ్య కెప్టెన్ గా కొనసాగనున్నాడు.
Also Read : రెండో టెస్టుకు ఆరో స్థానంలో రోహిత్ బ్యాటింగ్
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇటీవలే ముగిసిన మెగా వేలంలో రూ.11.25 కోట్లకు ఇషాన్ కిషన్‌ను దక్కించుకుంది. ఇషాన్ కిషన్ కోసం వేలంలో ఫ్రాంచైజ్‌లు పోటీ పడ్డాయి. ముందుగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్ర పోటీ నడవగా.. చివర్లో ఎంట్రీ ఇచ్చిన ఎస్ఆర్హెచ్ అనుహ్యంగా ఇషాన్ కిషన్‌ను కొనుగోలు చేసింది. కాగా, ఐపీఎల్లో గత కొన్ని సీజన్లుగా ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ తరుఫున ఆడుతోన్న విషయం తెలిసిందే.
Captain Hardik Pandya with an emotional send off message for Ishan Kishan ?
— Johns. (@CricCrazyJohns) December 1, 2024
- "The energy of the Mumbai Indians" ? pic.twitter.com/0Im1BUNT2J