ఓ వ్యక్తి పార్లమెంటీరియన్ గా చెలామణి అవుతున్నారంటే అందుకు కారణం ఆయన తండ్రే. అలా ఎంపీగా చెలామణి అవ్వడం హార్డ్ వర్క్ ఎలా అవుతుందంటూ ఇటీవల తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్లుగా నియమితులైన ఓ నేత ఆ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం నుంచి వ్యాఖ్యలు చేశారు.
అయితే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాబోయే ఎన్నికల కోసం 32 వైస్ ప్రెసిడెంట్లు, 57జనరల్ సెక్రటరీ, 104సెక్రటరీలు, 56 మందిని ఉపాధ్యక్షుల్ని 32మంది ఎక్స్ అఫీషియో సభుల్ని, 200 మందిని నియమించింది. ఆ నియామకంపై కార్తీ చిదంబరం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరికి అధికారం లేకపోతే ఈ జంబో కమిటీల వల్ల లాభం ఉండదు. జవాబుదారీతనం ఉండదని” చిదంబరం ట్వీట్ చేశారు. ఆ వ్యాఖ్యలపై తమిళనాడు పార్టీ జనరల్ సెక్రటరీ గా నియమితులైన కే. మహేంద్రన్ మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూఐ, మహిళా కాంగ్రెస్, మరియు షెడ్యూల్ క్యాస్ట్ విభాగాలు రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేందుకు భవిష్యత్ కార్యచరణను సిద్ధం చేశాయి. ఇదంతా తండ్రిని అడ్డం పెట్టుకొని ఎంపీ అయిన వ్యక్తికి ఎలా అర్ధం అవుతుందంటూ తమిళనాడు శివగంగ నియోజకర్గ ఎంపీగా కార్తి చిదంబరాన్ని ఉద్దేశిస్తూ పరోక్షంగా మట్లాడాడు.
