వంశీచంద్‌‌కు టికెట్ ఇవ్వడం పట్ల హర్షం

నర్వ, వెలుగు: మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్‌‌‌‌‌‌‌‌ రెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయించండంతో నర్వ మండల కేంద్రంలో శనివారం సంబరాలు చేసుకున్నారు.  ఈ సందర్భంగా చెన్నయ్య సాగర్ మాట్లాడుతూ..   ప్రజా గొంతుకను పార్లమెంటులో వినిపించేందుకు పాలమూరు నుంచి వంశీచంద్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని గెలిపించుకోవాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  పాలమూరు ప్రజా సమస్యలపై పరిపూర్ణ అవగాహన కలిగిన యువ నాయకుడుకి టికెట్‌‌‌‌‌‌‌‌ రావడం సంతోషంగా ఉందన్నారు. 

మిడ్జిల్, వెలుగు: మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా వంశీ చంద్ రెడ్డి గెలుపు ఖాయమని మిడ్జిల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ వంశీచంద్ రెడ్డికి రావడంతో శనివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.  మొదటి విడతలోనే వంశీచంద్ రెడ్డికి టికెట్ కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు.  కార్యక్రమంలో ఎంపీటీసీలు ఎండి గౌస్, రాజారెడ్డి, సాయిలు మల్లికార్జున్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, శివ గౌడ్ తదితరులు ఉన్నారు.