హనుమాన్ జయంతి: వానరులకు ఆత్మీయ విందు

హనుమాన్ జయంతి సందర్భంగా వానరులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు  జాగృతి అభ్యుదయ సంఘం. ప్రస్తుత తరుణంలో ఆహారం దొరకక అంతరించిపోతున్న వానర సంతతిని పరిరక్షించాలనే సదుద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు జాగృతి అభ్యుదయ సంఘం చైర్మన్ భావన శ్రీనివాస్ తెలిపారు.

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఒక రోజు ముందుగా మే 31వ తేదీ శుక్రవాం జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో వానరులకు ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు.  వానరులకు అరటి, జామ పండ్లు... క్యారెట్, పల్లిలు తదితర ఆహార పదార్థాలు అందచేశారు.

రంగారెడ్డి జిల్లా సాహెబ్ నగర్ లోని ఆంజనేయ స్వామి దేవాలయం నుండి కోహెడ గ్రామ పరిధిలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంకు బైక్ ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్  ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు...ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నీరు, ఆహారం దొరకక చనిపోతున్న మూగజీవాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరు భావన శ్రీనివాస్ ను ఆదర్శంగా తీసుకొని వానరులను  రక్షించుకోవాలని  ఉప్పల శ్రీనివాస్ గుప్తా పిలుపునిచ్చారు.