ఇండియా-ఎ? కెప్టెన్ గా తెలుగు కుర్రాడు .

ఇండియా-ఎ? కెప్టెన్ గా తెలుగు కుర్రాడు .

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌‌లో పర్యటించే ఇండియా–ఎ టీమ్‌‌ను సెలెక్టర్లు సోమవారం ప్రకటించారు. రెండు నాలుగు రోజుల మ్యాచ్‌‌లకు తెలుగు కుర్రాడు హనుమ విహారి కెప్టెన్‌‌గా వ్యవహరించనున్నాడు. అంతకుముందు జరిగే రెండు వన్డే టూర్‌‌ మ్యాచ్‌‌లకు శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ సారథ్యం వహించనున్నాడు. డోపింగ్‌‌ నిషేధం తర్వాత రంజీల్లో చెలరేగిన పృథ్వీ షాకు రెండు టీమ్‌‌ల్లో చోటు లభించింది. దీంతో టీమిండియాలోకి వచ్చేందుకు ఈ ముంబైకర్‌‌కి మరోసారి మార్గం సులువైంది. రోహిత్‌‌, మయాంక్‌‌తో పాటు రిజర్వ్‌‌ ఓపెనర్‌‌గా పృథ్వీ టీమ్‌‌లో ఉండనున్నాడు. వీలైనంత ఎక్కువగా కివీస్‌‌ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడాలనే ఉద్దేశంతోనే షా ను అక్కడికి పంపిస్తున్నామని ఎమ్మెస్కే తెలిపాడు. టెస్ట్‌‌ స్పెషలిస్ట్‌‌లు అశ్విన్‌‌, రహానె, ఉమేశ్‌‌ యాదవ్‌‌, ఇషాంత్‌‌ రెండో నాలుగు రోజుల మ్యాచ్‌‌లో బరిలోకి దిగనున్నారు.  మయాంక్‌‌ కూడా రెండు టీమ్‌‌ల్లో చోటు సంపాదించాడు. వికెట్‌‌ కీపర్‌‌గా ఆంధ్ర ప్లేయర్‌‌ కేఎస్‌‌ భరత్‌‌ను ఎంపిక చేశారు. హార్దిక్‌‌ పాండ్యాను కూడా వన్డే టీమ్‌‌లో చేర్చారు. జనవరి 17, 19న రెండు వన్డేలు, జనవరి 30 నుంచి ఫిబ్రవరి 10 వరకు రెండు నాలుగు రోజుల మ్యాచ్‌‌లు జరుగనున్నాయి.