న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి మళ్లీ ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు తప్పక మాస్కులు కట్టుకోవాలని, శానిటైజర్లను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులను కొందరు సరిగ్గా కట్టుకోవడం లేదు. కాబట్టి మాస్కులను పూర్తిగా కట్టుకోవాలని చెబుతున్నారు. కరోనా వైరస్ మెదడులోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని కొత్త సర్వేలో తేలింది. ముక్కు ద్వారా వైరస్ మెదడులోకి వెళ్లే చాన్సెస్ ఉన్నాయని జర్మనీ సైంటిస్టులు అంటున్నారు.
కొందరు కరోనా పేషెంట్స్‌లో న్యూరోలాజికల్ సింప్టమ్స్‌ను గుర్తించామని నేచర్ న్యూరోసైన్స్ అనే జర్నల్‌లో పబ్లిష్ నివేదిక పేర్కొంది. సార్స్-కొవిడ్-2 శ్వాసకోశ వ్యవస్థపైనే గాక సెంట్రల్ న్యూరో సిస్టమ్ (సీఎన్ఎస్) మీదా ప్రభావం చూపిస్తుందని సదరు స్టడీ తెలిపింది. దీని వల్ల వాసన, రుచిని కోల్పోవడం, తలనొప్పి, అలసట, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించింది. జర్మనీలోని ఛారైట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ నివేదికను రూపొందించారు. ఈ స్టడీలో భాగంగా కరోనాతో మృతి చెందిన 33 మంది పేషెంట్లను మెదళ్లను పరిశీలించారు. ఈ స్టడీని బట్టి మాస్కులను సరిగ్గా కట్టుకోకపోతే ముక్కు ద్వారా వైరస్ బ్రెయిన్‌లోకి వెళ్లే చాన్సెస్ ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
