ఈ నెల(జులై) 29వ తేదీ నుంచి హజ్ యాత్ర ప్రారంభం కానుంది. కరోనా వ్యాప్తి కారణంగా ఈ సారి హజ్ యాత్రలో కేవలం 1000 మందిని అనుమతించాలని సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా 2.5 మిలియన్ల మంది భక్తులు పవిత్ర హజ్ యాత్రలో పాల్గొని ప్రార్థనలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కరోనా ప్రభావం కారణంగా 65 ఏళ్ల వయసు లోపు ఉండి… ఎలాంటి వ్యాధులు లేని వెయ్యిమందిని మాత్రమే యాత్రకు అనుమతించాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. వెయ్యిమంది హజ్ యాత్రికుల్లో 70 శాతం మంది విదేశీయులకు, 30 శాతం మంది సౌదీ పౌరులకు అనుమతించనున్నారు.
