కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఇన్​చార్జిగా హబీబ్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్  పార్లమెంట్  కాంగ్రెస్  పార్టీ మైనార్టీ సెల్  ఎన్నికల ఇన్​చార్జిగా హబీబ్ ను నియమించారు. ఆల్  ఇండియా కాంగ్రెస్   సెల్  జాతీయ అధ్యక్షుడు ఇమ్రాన్ ప్రతాప్  ఘరి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. కో అబ్జర్వర్ గా మహమ్మద్ సిరాజుద్దీన్ ను నియమించారు. పార్లమెంట్  పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. గద్వాలకు షేక్​ రఫీక్, అలంపూర్ కు మహబూబ్, నాగర్ కర్నూల్ కు నసీరుద్దీన్, అచ్చంపేటకు సిద్ధిక్, కల్వకుర్తికి మక్బూల్, కొల్లాపూర్ కు షేక్​ రహ్మాన్ పాషాను నియమించారు.