చీఫ్ విప్, విప్‎ల నియామకం.. ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్‎గా జీవీ ఆంజనేయులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ, శాసన మండలిలో చీఫ్ విప్‎లు, విప్‎ల నియమాకాలు చేపట్టింది. శాసన సభలో విప్‎లుగా 15 మంది నియమితులయ్యారు. అసెంబ్లీ చీఫ్ విప్‎గా సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును ప్రభుత్వం నియమించింది. శాసన మండలి చీఫ్ విప్‎గా పంచుమర్తి అనురాధ నియామకం అయ్యారు. ఎమ్మెల్సీలు చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్, జనసేన నుండి పి. హరిప్రసాద్‎లను శాసన మండలిలో విప్‎లుగా ప్రభుత్వం అపాయింట్ చేసింది. 

టీడీపీ ఎమ్మెల్యేలు అశోక్ బెందాలం, బోండా ఉమ, దాట్ల సుబ్బారావు, యనమల దివ్వ, థామస్, జగదీశ్వరి, కాల్వ శ్రీనివాసులు, మాధురి, గణబాబు, తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్రావు.. జనసేన ఎమ్మెల్యేలు బొమ్మడి నారాయణ, అరవ శ్రీధర్, బొలిశెట్టి శ్రీనివాస్.. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ శాసన సభలో విప్ లుగా నియమితులయ్యారు. ఈ మేరకు 2024, నవంబర్ 12వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.