గుర్రంపోడు ఎస్ఐ వి. నారాయణరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. వివాహిత హత్య కేసు విచారణలో నిర్లక్ష్యంగా వహించడంతో పాటు నిందితులను తప్పించేందుకు లంచం తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఐజి సత్యనారాయణ ఈ చర్యలు తీసుకున్నారు.
గుర్రంపోడు మండలం ముల్కలపల్లిలో ఇటీవల ఓ వివాహిత హత్య జరిగింది. ఈ కేసు విచారణలో ఎస్ఐ నారాయణరెడ్డి నిర్లక్ష్యంగా వహించారనే ఆరోణపణలు ఉన్నాయి. అంతేకాదు, హత్య కేసులో A-2, A-3 నిందితులను తప్పించేందుకు కానిస్టేబుల్ ద్వారా లక్ష రూపాయలు లంచం తీసుకున్నట్లు బయటకొచ్చింది. ఇది విచారణలో నిజమని తేలడంతో ఐజి సత్యనారాయణ అతన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే కేసులో కొండమల్లేపల్లి సీఐ ధనుంజయ్ గౌడ్‌తో పాటు మరో కానిస్టేబుల్‌పై విచారణ కొనసాగుతోంది.