మళ్లీ మూతపడ్డ గుంటూరు మిర్చి యార్డు

మళ్లీ మూతపడ్డ గుంటూరు మిర్చి యార్డు

గుంటూరు: కరోనా తీవ్రత రోజు రోజుకూ పెరుగుతుండడంతో గుంటూరు మిర్చి యార్డు మళ్లీ మూతపడింది. ఈ నెల 19వ తేదీ వరకు మార్కెట్ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కరోనా తీవ్రత నేపథ్యంలో 23 కంటైన్మెంట్ జోన్ లను కలెక్టర్ ప్రకటించారు. మిర్చి యార్డు కూడా కంటైన్మెంట్ జోన్ పరిధిలోకి వస్తుండడంతో మూసివేత తప్పలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సరుకు తెచ్చిన రైతులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినా మరో మార్గం కనిపించడం లేదన్నారు. వర్షాలు కురుస్తుండడంతో మిర్చి తడవకుండా టార్పాలిన్లు.. కవర్లతో మూసివేసి జాగ్రత్తపడుతున్నారు.