గద్వాల అడిషనల్ ఎస్పీగా గుణశేఖర్

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా అడిషనల్ ఎస్పీగా గుణశేఖర్ పోలీస్ కార్యాలయంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు.  గ్రూప్ -1 , 2010 బ్యాచ్ డీఎస్పీగా సెలెక్ట్ అయిన ఆయన  వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించారు.  అదనపు ఎస్పీగా ప్రమోషన్ పొంది హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని సీఐడీ  సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేసి బదిలీలో భాగంగా జిల్లాకు వచ్చారు.