Women Health : నెలసరి నొప్పికి గమ్మీలు

పోస్ట్ మెనుస్ట్రువల్ సిండ్రోమ్, పీరియడ్ కి ముందు నుంచి రోజుల ఈ సిండ్రోమ్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. పట్టరాని కోపం, విపరీతమైన టెన్షన్, ఆదుర్దా, మూడ్ స్వింగ్స్, ఫుడ్ క్రేవింగ్స్, నిద్రలేమి ఈ సిండ్రోమ్ లక్షణాలు. అలాగే కండరాలు, ఒళ్లు, ఛాతి నొప్పులు, తలనొప్పి, బరువు పెరగడం, యాక్ ను, కడుపు ఉబ్బరం కూడా మామూలే. పీరియడ్ కన్నా పోస్ట్ మెనుస్ట్రువల్ సిండ్రోమే ఎక్కువ ఇబ్బంది పెడుతుంది కొందరిని. కానీ, ఈ సిండ్రోమ్ గురించి ఎవరూ నోరు విప్పి మాట్లాడరు.

ప్రతినెలా మౌనంగానే ఆ నొప్పిని భరిస్తుంటారు చాలామంది. అయితే ఆడవాళ్లకి ఈ సిండ్రోమ్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి వచ్చినవే గమ్మీ టెడ్డీస్. పవర్ గమ్మీస్ అనే కంపెనీ ఈ స్పెషల్ గమ్మీలని రీసెంట్ గా మార్కెట్ లోకి తీసుకొచ్చింది. బెర్రీ గుజ్జు, మిల్క్ థిస్టిల్ (బోడసారం) గింజలతో తయారుచేసిన ఈ గమ్మీలు పిఎమ్ఎస్ లో కనిపించే ఒళ్లు నొప్పులు, తిమ్మిర్లతో పాటు ఛాతి ఉబ్బు, నొప్పిని తగ్గిస్తాయి. ఈ గమ్మీలలోని విటమిన్ -సి పీరియడ్ టైంలో బ్లీడింగ్ సజావుగా అయ్యేలా చూస్తుంది. 

Also Read :-  ఇంట్లోనే గుండెకు ఎక్సర్ సైజ్లు

మెగ్నీషియం, సల్ఫేట్ నిద్రలేమిని దూరం చేస్తాయి. సిట్రస్ బయో ఫ్లేవనాయిడ్స్, విటమిన్-బి6 ఆకలిని కంట్రోల్ చేస్తాయి. నెలసరి సైకిల్కి ముందు మూడురోజుల పాటు రోజుకో గమ్మీ, పీరియడ్లో నాలుగు గమ్మీలు, పీరియడ్ తర్వాత మూడు రోజుల పాటు ఈ గమ్మీలు తింటే చాలు. వీటిని Powerbgummies.com లో కొనుకోవచ్చు.