- సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన గల్ఫ్ కార్మికులు
బెజ్జంకి,వెలుగు: గల్ఫ్ బాధితులకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందజేసే జీవోను విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం మండల కేంద్రంలో గల్ఫ్ కార్మికుల రాష్ట్ర ప్రతినిధి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్మికుల కుటుంబాల కష్టాలు తెలిసిన సీఎం హామీని నెరవేర్చడం ప్రశంసనీయమన్నారు. వారికి మా కుటుంబాలు రుణపడి ఉంటామని తెలిపారు.
గల్ఫ్ కార్మికుల పట్ల ప్రత్యేక చొరవ చూపిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిల శ్రీధర్ బాబు, మనకోడూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రం, రమేష్ బుర్ర, తిరుపతి, శీను గల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు.
దళిత బంధు నిధులు విడుదలపై హర్షం
ఖమ్మం జిల్లా చింతకాయల పల్లి మండలంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దళిత బంధు విడుదల చేయడం సంతోషకరమని రాష్ట్ర దళిత బంధు సాధన సమితి నాయకులు ఎలుక దేవయ్య అన్నారు.