దేవుడి పుణ్యం అనుకునే వాళ్లం గతంలో.. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యాన వింత వింతలన్నీ వచ్చేస్తున్నాయి. ఇక ఫుడ్ విషయంలో అయితే కలలో కూడా ఊహించని టేస్టులు కనిపిస్తున్నాయి. రీసెంట్ గా ఓ దోశ స్పెషల్ ఐటమ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇప్పటి వరకు మసాలా దోశ, ఉల్లి దోశ, పన్నీరు దోశ, కారం దోశ, ఎగ్ దోశ, చికెట్ దోశ వంటివి మాత్రమే మనకు తెలుసు.. మనం తిని ఉంటాం.. కొత్తగా ఓ రెసిపీ షాక్ కి గురి చేస్తోంది. అదే గులాబ్ జాం, ఐస్ క్రీం కలగలిపిన దోశ..
అవును మీరు విన్నది.. చూస్తున్నది నిజమే. గులాబ్ జాం, ఐస్ క్రీం ఇది. దోశపై గులాబ్ జాం రోల్స్ వేసి.. ఆ తర్వాత ఐస్ క్రీంతో మిక్స్ చేసి.. మీ ప్లేట్ లో వేస్తున్నారు. కొత్త దోశ స్పెషల్ పూర్తి వివరాలు చూసేద్దామా..
మాయ అనే ట్విటర్ యూజర్ ఇందుకు సంబంధించిన దోశ తయారీ వీడియోను తన ట్విటర్ అకౌంటర్లో ఉంచారు. చెఫ్ ముందుగా పెనంపై దోశ వేసి దానిపై కొన్ని గులాబ్జామున్స్ ఉంచాడు. వాటిని చిదిమి దోశ మొత్తం స్ప్రెడ్ చేశాడు. లాస్ట్‌లో దోశ మధ్యలో వనిల్లా ఐస్‌క్రీం ఉంచి దాని మధ్యలో మరో గులాబ్‌జామూన్ పీస్ ఉంచాడు.
దీనిని వేడి వేడిగా.. చల్ల చల్లగా సర్వ్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటివరకు ట్విటర్లో 14 వేలకు పైగా వీక్షించారు. అయితే ఈ దోశ కొందరికి నచ్చితే.. మరి కొందరికి నచ్చలేదు. గులాబ్జామూన్లతో ఇలాంటి ప్రయోగాలు చేయడం ఇదే మొదటి సారేం కాదు. అయితే వేటి ప్రత్యేకత వాటిదే.
