IPL Retention 2025: గిల్‌ను మించిపోయిన రషీద్ ఖాన్.. షమీ, మిల్లర్ లను రిలీజ్ చేసిన గుజరాత్

ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ యంగ్ ప్లేయర్లకు అవకాశమిచ్చింది. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ కు ముందు నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. అంతర్జాతీ సూపర్ స్టార్ టీ20 స్పెషలిస్ట్ రషీద్ ఖాన్ ను తొలి రిటైన్ ప్లేయర్ గా రూ. 18 కోట్ల రూపాయలు ఇచ్చి తీసుకున్నారు. కెప్టెన్ శుభమాన్ గిల్ కు రూ. 16.50 దక్కాయి. సాయి సుదర్శన్ రూ. 8.50 కోట్లు.. రాహుల్ తెవాటియాకు రూ. 4 కోట్లు, షారుక్ ఖాన్ కు రూ 4 కోట్లతో గుజరాత్ జట్టులో కొనసాగనున్నారు. 

ALSO READ | IPL Retention 2025: పంత్ ఔట్.. అక్షర్ పటేల్ టాప్: నలుగురు రిటైన్ ప్లేయర్లతో ఢిల్లీ

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, సౌతాఫ్రికా  స్టార్ ఫినిషర్ డేవిడ్ మిల్లర్ ను రిలీజ్ చేసి బిగ్ షాక్ ఇచ్చారు. RTM కార్డు ద్వారా గుజరాత్ టైటాన్స్ ఒక క్యాప్డ్ ప్లేయర్ ను మాత్రమే రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. నలుగురు ప్లేయర్ల కోసం గుజరాత్ మొత్తం రూ. 69 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. దీంతో వారు రూ. 51 కోట్లతో వేలంలోకి అడుగుపెట్టనున్నారు.