human trafficking:తండ్రి వద్ద డబ్బులు వసూలు చేసేందుకు..అప్పిచ్చినోళ్లు బాలికను రూ.4లక్షలకు అమ్మేశారు

హ్యూమన్ ట్రాఫికింగ్..అంటే మానవ అక్రమ రవాణా..ప్రస్తుతం మన దేశానికి పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఒకటి. ఇది టెక్ యుగంలో బానిసత్వానికి ఓ రూపం. మనుషు లను మానసికంగా, శారీరంగా శ్రమను దోచుకోవడం అన్నమాట. హ్యూమన్ ట్రాఫికింగ్ మన దేశంలోనే కాదు.. అమెరికాలాంటి ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఈ దుస్థితి ఉంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. స్థానికంగా ఉండే ఆచారాలు, కొన్ని కట్టుబాట్లవంటి హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రోత్సహించబడుతోంది. ఇటీవల గుజరాత్ లో కన్న కూతురుని డబ్బుకోసం అమ్ముకున్న తండ్రి దీనదుస్థితి ఒకటి వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. 

హృదయాన్ని కదిలించే ఘటన..మనుసును కలవర పెట్టే దుస్థితి. గుజరాత్ లో డబ్బు కోసం ఏడేళ్ల కన్న కూతురుని ఓ అభాగ్యపు తండ్రి అమ్ముకున్నాడు. రాజస్థాన్ కు చెందిన ఓవ్యక్తి రూ. 4లక్షలకు అమ్మేశాడు. స్థానిక ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లాలో ఈ ఘటన జరిగింది. తన మేనల్లుడు దీలిప్ చేసిన అప్పు తీర్చేందుకు ఈ భయానక చర్యకు పాల్పడ్డాడు ఆ తండ్రి. 

ALSO READ | నీ ఆత్మహత్య ప్రయత్నం వల్ల మాకు నష్టం..రైతుకు10 లక్షల బిల్లు పంపిన పోలీసులు

బాలికను అమ్మితే వచ్చిన మొత్తం సొమ్ములో రూ.1.6 లక్షలు దిలీప్‌కు అప్పు తీర్చేందుకు, డీల్‌కు దళారీగా వ్యవహరించినందుకు అర్జున్‌ అనే వ్యక్తికి రూ.30 వేలు, అమ్మాయిని తీసుకెళ్లేందుకు ఉపయోగించిన కారును అందించిన లఖ్‌పతి నాట్‌ అనే వ్యక్తికి రూ.20 వేలు, మిగిలిన రూ.1.9 లక్షలను బాలిక తండ్రి తన వద్ద ఉంచుకున్నాడు.

అసలేం జరిగింది..

బాలిక తండ్రికి వరుసకు మేనల్లుడు అయిన దీలిప్ వారి ఇంట్లోనే ఉంటున్నాడు. ఓ వ్యక్తి దగ్గర రూ. 1.60లక్షల అప్పు చేశాడు.. అప్పు తీర్చకుండా పారిపోయాడు. దీంతో అప్పు భారం అంతా బాలిక తండ్రిపై పడింది. అప్పు ఇచ్చిన వ్యక్తి ..బాలిక తండ్రిపై ఒత్తిడిపెంచాడు. 

అదే ఊరికి చెందిన లకపతి నాట్, ఇంకొందరు సలహా మేరకు అప్పు తీర్చాలంటే తన బిడ్డ అమ్ముకునేందుకు నిర్ణయించుకున్నాడు బాలిక తండ్రి. రూ. 4లక్షలకు డీల్ కుదిరింది. మధ్యవర్తుల మధ్య ఓ ఒప్పంద కాగితంపై సంతకం చేసి ఏడేళ్ల తన కూతురుని అప్పగించాడు. ఒప్పందం ప్రకారం..బాలికను కొనుగోలు చేసిన రాజస్థాన్ కు చెందిన ఉమ్మద్ సింగ్ కొడుకును పెళ్లి చేసుకోవాలి. బాలికకు యుక్తవయస్సు వచ్చేదాకా ఉమ్మద్ సింగ్ ఇంట్లోనే ఉండాలి. 

బాలికను కొనుగోలు చేసిన వ్యక్తి ఆ బాలిక చేత ఇంటిని శుభ్రం చేయడం, తుడవడం, వంటి గిన్నెలు కడిగించడం వంటి భారీ పనులు చేయించడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పులు, ఆర్థిక సమస్యల కారణంగా కొందరు ఏవిధంగా హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడుతున్నారో హైలైట్ చేసింది. 

బాలిక అమ్మకం విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు రంగంలోకిదిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరంలో కీలకపాత్ర పోషించిన అర్జున్‌ నాట్‌, షరీఫా నత్‌, లఖ్‌పతి నాట్‌, శ్రవణ్‌ నత్‌లను పోలీసులు అరెస్టు చేశారు. బాలిక తండ్రి, బాలికను కొనుగోలు చేసిన ఉమ్మద్ సింగ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నారు.