కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్క్ తప్పనిసరి ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మాస్క్ ధరించకపోతే పలు రాష్ట్రాల్లో రూ.1000 ఫైన్ కూడా విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా సమయంలో మాస్క్ ధరించాలనే నిబంధనను ఉల్లంఘించిన వ్యక్తుల నుంచి రూ.115 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు గుజరాత్ ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టుకు నివేధిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో డిసెంబర్ 22 వరకు 23,64,420 మంది నుండి రూ. 115 కోట్ల 88 లక్షలు వసూలు చేసినట్లు తెలిపింది. చీఫ్ జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జెబి పార్దివాలాతో కూడిన డివిజన్ బెంచ్‌కు అఫిడవిట్ సమర్పించారు.
దేశంలోనే తొలిసారి : మేయర్ గా 21 ఏళ్ల కాలేజీ విద్యార్ధిని
