ఇదేందయ్యా ఇది.. గుర్రం తోకకు గిన్నిస్​

జుట్టు పోనీ టెయిల్​ వేసుకుంటే చాలామంది ‘గుర్రంతోక’ అని ఎగతాళి చేస్తారు. కానీ, ఈ గుర్రం తోక చూశారంటే ఆ మాట అనరు. నలుపు రంగులో ఉన్న ఈ తోక పొడవు దాదాపు ఆరు అడుగులు ఉంది. అందుకే దీనికి గిన్నిస్ రికార్డ్​ దక్కింది.

దక్షిణ కరోలినాలోని మూడు అడుగుల ఒక అంగుళం ఉన్న ఈ గుర్రం పేరు స్వీటీ. ఇది చాలా చిన్న గుర్రం. వయసు 36  ఏండ్లు. దీని యజమాని రిసా ఫార్మిశానో. స్వీటీ తోక గిన్నిస్ రికార్డ్​కు ఎక్కిందని మురిసిపోతున్నాడాయన. ఎందుకంటారా.. మరి దాని తోక అంత పొడవుగా పెరగడానికి కారణం ఆయనే. స్వీటీ తోకను జాగ్రత్తగా చూసు కునేవాడట రిసా. ఏడాదికి రెండుసార్లు దాన్ని శుభ్రం చేసి,  కండిషనర్​ పెట్టేవాడట.

 అంతేకాదు.. ఒక గుర్రం చనిపోయిందని మిగతా రెండు గుర్రాలు బాధపడుతుంటే వాటిని అలా చూడలేక స్వీటీని ఇంటికి తెచ్చాడు. అప్పటి నుంచి దాని బాగోగులు చూసుకుంటున్నాడు. ‘2012లోనే నిల్చుంటే నేలను తాకేది స్వీటీ తోక’ అని చెప్తాడు రిసా. ఇప్పుడు అది ఏకంగా 5 అడుగుల, 11.26 అంగుళాలు ఉంది. దీంతో గుర్రాల తోక ఇంత పొడవు పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది అందర్నీ. అందుకే ఈ తోకకు గిన్సిస్​ రికార్డ్​లో చోటు దక్కింది. 
Risa Formisano,