హైదరాబాద్, వెలుగు: గుఫిక్ బయోసైన్సెస్ దేశ మార్కెట్లో విస్తరించాలని చూస్తోంది. లైయోఫిజ్డ్ యాంటిబయోటిక్స్, యాంటిఫంగల్ (ఒక రకమైన డ్రగ్స్ స్టోరేజ్ విధానం) మార్కెట్లో రూ. 3,000 కోట్ల విలువైన వాటాను అందుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇనొవేటివ్ ప్రొడక్ట్‌లను తీసుకొచ్చే ఈ కంపెనీ, హెర్బల్ ప్రొడక్ట్స్‌తో పాటు వివిధ ఏపీఐలను తీసుకొచ్చి దేశంలో విస్తరించాలని చూస్తోంది. కంపెనీ కిందటి వారం మెడిసిన్స్‌ను డెలివరీ చేయడానికి ‘డ్యూయల్ ఛాంబర్ బ్యాగ్స్’ సిస్టమ్‌ను కూడా లాంచ్ చేసింది.
