శాడిస్ట్ గెస్ట్ లెక్చరర్

  • పని చేసిన చోటల్లా లైంగిక వేధింపులే
  • తాజాగా గద్వాల రూరల్  పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు

గద్వాల, వెలుగు: ఆయన ఒక శాడిస్ట్  గెస్ట్  ఫ్యాకల్టీ, పని చేసిన చోటల్లా లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఉద్యోగం ఊడిపోయింది. తాజాగా గద్వాల మండలంలోని గురుకుల పాఠశాలలో ఉద్యోగం కోసం ఎంక్వైరీకి వెళ్లి అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక పేరెంట్స్  ఫిర్యాదు మేరకు గద్వాల రూరల్  పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. శాంతినగర్ మండలం తిమ్మాజీపల్లెకు చెందిన ఆంజనేయులు గెస్ట్  ఫ్యాకల్టీ గా పని చేస్తున్నాడు. గతంలో వనపర్తి జిల్లాలో పని చేస్తున్న చోట అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు దిగాడు. అమ్మాయి పేరెంట్స్, అక్కడి టీచర్లు ఎంత చెప్పినా ఆయన తీరు మార్చుకోకపోవడంతో గుండు గీయించి అవమానకర రీతిలో అక్కడి నుంచి పంపించేశారు. అక్కడి నుంచి వచ్చిన ఆయన మల్దకల్ మండలంలోని ఓ కాలేజీలో గెస్ట్  ఫ్యాకల్టీగా చేరారు. అక్కడ 10 మంది అమ్మాయిలకు లవ్  లెటర్లు రాయడంతో పాటు లైంగికంగా వేధించడంతో ఆయనను అక్కడి నుంచి పంపించేశారు. రెండు రోజుల కింద గద్వాల మండలంలోని ఒక గురుకుల పాఠశాలకు వచ్చి ఉద్యోగం ఉందా? అని అడిగి అక్కడే ఉన్న ఒక బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు దిగాడు. స్కూల్  టీచర్లు, బాధితురాలి పేరెంట్స్  ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల కింద ఆంజనేయులుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించారు.