భారీగా జీఎస్టీ వసూళ్లు

భారీగా జీఎస్టీ వసూళ్లు

జీఎస్టీ వసూళ్లు భారీగా నమోదు అయ్యాయి. ఫిబ్రవరి నెలలో రూ.1.33 లక్షల కోట్లు జీఎస్టీ వసూలు అయ్యింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 18 శాతం వృద్ధి రికార్డయ్యింది. అయితే, గత నెలలో నమోదైన రూ.1.40 లక్షల కోట్లతో పోలిస్తే మాత్రం తగ్గుదల కనిపిస్తతోంది. కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తే దీనికి కారణమని ఆర్థిక శాఖ ప్రకటనలో పేర్కొంది. దీంతో పాటు 
ఫిబ్రవరిలో 28 రోజులే ఉంటాయి కాబట్టి.. జనవరితో పోలిస్తే వసూళ్లు తగ్గుతాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.

తాజా రూ.1.33 లక్షల కోట్ల వసూళ్లలో కేంద్ర జీఎస్టీ (CGST) రూ.24,435 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్టీ (SGST) రూ.30,779 కోట్లు. సమ్మిళిత జీఎస్టీ (IGST) కింద రూ.67,471 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.33,837 కోట్లతో కలిపి), సెస్‌ రూపంలో రూ.10,340 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.638 కోట్లతో కలిపి) వసూలైనట్లు ఆర్థికశాఖ తెలిపింది. 2021 ఏప్రిల్‌ నెలలో వసూళ్లు జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. ఆ నెల రూ.1.41లక్షల కోట్లు వసూలయ్యాయి.