రిటర్న్‌ ఫైల్‌ చేయకుంటే.. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ రద్దే!

రిటర్న్‌ ఫైల్‌ చేయకుంటే.. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ రద్దే!

జీఎస్టీ ఎగవేతలను అడ్డుకోవడానికి ఇక నుంచి ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇక నుంచి జీఎస్టీ రిటర్న్‌‌లు ఫైల్‌‌ చేయని వారి రిజిస్ట్రేషన్‌‌నే రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఫీల్డ్‌‌ ఆఫీసర్లకు ఆదేశాలు పంపింది. ఇక మీదట రిటర్న్‌‌లు ఫైల్‌‌ చేయని జీఎస్టీ
అసెసీల రిజిస్టర్డ్‌‌ ఆస్తు లను తాత్కాలికంగా జప్తు చేస్తారు. నేర తీవ్రత ఎక్కువగా ఉండి, ప్రభుత్వ రాబడులకు ఇబ్బంది వస్తుందని భావిస్తే అసెస్సీ బ్యాంకు అకౌంట్లూ పనిచేయకుండా చేస్తారు. ఆఫీసర్లే తమ విచక్షణ ప్రకారం అసెసీ ఎంత పన్ను కట్టాలో నిర-్ణయిస్తారు. వాళ్లకు అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా పన్ను మొత్తాన్ని లెక్కిస్తారు. జీఎస్టీ చట్టం ప్రకారం.. రిటర్న్‌‌లు అందజేయని వ్యాపారులు/ కంపెనీల రిజిస్ట్రేషన్‌‌ను రద్దు చేసే అధికారం ఫీల్డ్‌‌ ఆఫీసర్లకు ఉంటుంది.

నిర్దిష్టకాలంలో రిటర్న్‌‌లు ఫైల్‌‌ చేయనప్పుడు సెంట్రల్‌‌ జీఎస్టీ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తారు. ఉల్లం ఘనలను మరీ ఎక్కువగా ఉంటే కమీషనర్‌‌స్ థా యి ఆఫీసర్‌‌కు అసెసీ ఆస్తు లను తాత్కాలికంగా అటాచ్‌ చేసే అధికారమూ ఉంటుం దని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాదిలో ఒక్క నెల మినహా మిగతా నెలల్లో జీఎస్టీ వసూళ్లు టార్గెట్లను చేరుకోలేదు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తు తం సంవత్సరంలో జూన్‌‌ వరకు 1.2 కోట్ల జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ప్రభుత్వానికి అందా యి. ఇదే ఏడాది అక్టోబరు వరకు రిటర్న్‌‌ల సంఖ్య మాత్రం 78 లక్షలను మించలేదు. జీఎస్టీ విధానం కొత్తది కాబట్టి వ్యాపార సంస్థలు దీనికి అనుగుణంగా మారాలి కాబట్టి తొలి రెం డేళ్లలో ఆఫీసర్లు కఠినంగా వ్యవహరించలేదు. జీఎస్టీ వసూళ్లు తక్కువగా ఉన్నప్పటికీ, రేట్లను పెంచకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత వారం నిర్ణయించాయి. పన్నురేట్లు పెంచితే, ప్రజల ఖర్చు తగ్గుతుం దని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టమని ఎక్స్‌‌పర్టులు అంటున్నారు .

మరిన్ని వెలుగు వార్తలకు క్లిక్ చేయండి