నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్స్ కారణంగా గత సంవత్సరంలో ప్రభుత్వానికి రూ.40వేల కోట్ల నష్టం జరిగిందని జీఎస్టీ ఎగవేతలను ఆఫీసర్లు గుర్తించారు.ఇలాంటి లొసుగులను పూడ్చడానికి శనివారం నుంచి కొత్త విధానాలను అమలు చేస్తారు. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు ఇబ్బందికలగకుండా ఎగవేతదారులపై చర్యలు తీసుకుంటామని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ 2020 నవంబర్ 9 నుండి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్, వివిధ సెంట్రల్ జీఎస్టీ ఫార్మేషన్ల ద్వారా ఆల్-ఇండియా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. దాదాపు 5,700కు పైగా కేసులను గుర్తించింది.
