రూ.1.15 లక్షల కోట్లు వసూల్
కిందటి ఏడాదితో పోలిస్తే 11.6 శాతం పెరిగాయి
రూ. 1.10 లక్షల కోట్లు దాటింది మూడుసార్లే
న్యూఢిల్లీ: జీఎస్‌టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) కలెక్షన్స్ డిసెంబర్ నెలలో రికార్డు స్థాయికి పెరిగి రూ. 1.15 లక్షల కోట్లకు చేరాయి. జులై 2017లో జీఎస్‌టీ వచ్చినప్పటి నుంచి ఇవే అత్యధిక వసూళ్లు కావడం విశేషం. ఈ వసూళ్లు అంతకు ముందు ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే 11.6 శాతం ఎక్కువ. ఇంతకు ముందు ఏప్రిల్ 2019లో జీఎస్‌టీ కలెక్షన్స్ రూ. 1.14 లక్షల కోట్లుగా రికార్డయ్యాయి. జీఎస్‌టీ కలెక్షన్స్ డేటాను ఫైనాన్స్ మినిస్ట్రీ రిలీజ్ చేసింది.
అంతకు ముందు ఏడాదితో పోలిస్తే జీఎస్‌టీ కలెక్షన్స్ పెరగడం ఈ ఏడాదిలో వరసగా ఇది నాలుగోసారి. జీఎస్‌టీ కలెక్షన్స్ ప్రకారం చూస్తే ఎకానమీ స్ట్రాంగ్‌గా రికవర్ అవుతున్నట్లు తెలుస్తోందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఏప్రిల్–జూన్‌లో ఎకానమీ గ్రోత్ భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆ క్వార్టర్లో ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమలు చేసింది. ఫలితంగా జీడీపీ ఏకంగా 23 శాతం తగ్గింది. ఆ తర్వాత జులై–సెప్టెంబర్ క్వార్టర్లో ఎకానమీ కొంత పుంజుకుంది.
ఇంపోర్టెడ్ గూడ్స్‌పై జీఎస్‌టీ కలెక్షన్స్ అంతకు ముందు ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది డిసెంబర్‌లో ఏకంగా 27 శాతం పెరిగినట్లు డేటా చెబుతోంది. ఇదే కాలంలో డొమెస్టిక్ జీఎస్‌టీ పెరుగుదల 8 శాతమని ఫైనాన్స్ మినిస్ట్రీ తెలిపింది. జీఎస్‌టీ కలెక్షన్స్ బ్రేకప్ చూస్తే, సెంట్రల్ జీఎస్‌టీ రూ. 21,365 కోట్లు, స్టేట్ జీఎస్‌టీ రూ. 27,804 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ. 57,426 కోట్లు (ఇందులో ఇంపోర్టెడ్ గూడ్స్ నుంచి వచ్చిన రూ. 27,050 కోట్లు కలిసి ఉంది), కాంపెన్సేషన్ సెస్ రూ. 8,579 కోట్లుగా ఉన్నాయి. నవంబర్ నెలకుగాను డిసెంబర్ 31లోగా మొత్తం 87 లక్షల జీఎస్‌టీఆర్–3బీ రిటర్న్స్ ఫైలయ్యాయి.
ఫైనాన్స్ మినిస్ట్రీ డేటా ప్రకారం సెంటర్, స్టేట్స్‌కు సీజీఎస్‌టీ రూపంలో రూ. 44,641 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూపంలో రూ. 45,485 కోట్లు వసూలయ్యాయి. జీఎస్‌టీ కలెక్షన్స్ రూ. 1.15 లక్షల కోట్లను దాటడం ఇదే మొదటిసారని ఫైనాన్స్ మినిస్ట్రీ పేర్కొంది. ఈ ఏడాది నవంబర్‌లోని జీఎస్‌టీ వసూళ్లు రూ. 1.05 లక్షల కోట్ల కంటే డిసెంబర్ వసూళ్లు చాలా ఎక్కువని తెలిపింది. గత 21 నెలల్లో ఈ నెల కలెక్షన్సే భారీగా పెరిగాయని వెల్లడించింది. కోవిడ్ 19 మహమ్మారి బారి నుంచి ఎకానమీ బయటపడుతుండటంతోపాటు, దేశవ్యాప్తంగా జీఎస్‌టీ ఎగవేత అరికట్టేందుకు చేసిన దాడులూ కలెక్షన్స్ పెరగడానికి కారణమని తెలిపింది. జీఎస్‌టీ వచ్చినప్పటి నుంచీ ఇప్పటిదాకా మూడుసార్లే కలెక్షన్స్ రూ. 1.10 లక్షల మార్కును దాటాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో జీఎస్‌టీ కలెక్షన్స్ వరసగా రూ. లక్ష కోట్లను దాటడం ఇది మూడోసారని ఫైనాన్స్ మినిస్ట్రీ పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో జీఎస్‌టీ రెవెన్యూ సగటున 7.3 శాతం పెరిగింది. అంతకు ముందు క్వార్టర్‌లో జీఎస్‌టీ రెవెన్యూ బాగా తగ్గిపోయిన విషయం తెలిసిందే.
For More News..
సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
న్యూ ఇయర్‌కు నిమిషానికి 5వేలకు పైగా ఆర్డర్లు
వీడియో: రజినీకాంత్ ‘దర్బార్’కొచ్చిన డేవిడ్ వార్నర్
