డిసెంబర్ నెలలో లక్షకోట్లు వసూలైన జీఎస్టీ

డిసెంబర్ నెలలో లక్షకోట్లు వసూలైన జీఎస్టీ
జీఎస్ట్ భారీ ఎత్తున వసూలైనట్లు తెలుస్తోంది. రికార్డ్ స్థాయిలో గతేడాది డిసెంబర్ నెలలో సుమారు రూ.1,15,171 కోట్లు వసూలైంది. అందులో సీజీఎస్టీ రూ.21,365 కోట్లు, ఎస్ జీఎస్టీ రూ. 27,804 కోట్లు ఐజీఎస్టీ రూ.57,426 కోట్లు, సెస్ రూ.8,579, దిగుమతి సుంకం రూ.971 కోట్లు కలిపి మొత్తం రూ.1,15,171 కోట్లు వసూలైనట్లు కేంద్రం తెలిపింది. ఇక డిసెంబర్ నెలలో అత్యధికంగా కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రా మరియు నగర్ హవేలిలో 68 శాతం పెరుగుదలతో భారీ ఎత్తున జీఎస్టీ వసూలైంది. దాద్రా – హవేలిలో 2019లో  రూ. 154 కోట్లు వసూలు కాగా, 2020 డిసెంబర్ నెలలో రూ.259కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అత్యధికంగా జీఎస్టీ వసూలైన రాష్ట్రాల్లో త్రిపుర రెండో స్థానంలో ఉంది. 25శాతం పెరిగిన వసూళ్లతో సెంట్రల్ జీఎస్టీ రూ.21,365 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.27,804కోట్లుగా నమోదైంది. దీంతో కేంద్రం,రాష్ట్రం కలుపుకొని జీఎస్టీ రూ.57,426గా నిలిచింది.