గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ

గ్రూప్- 2 పరీక్ష ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది ఏపీపీఎస్సీ. మొత్తం 4,04,037 మంది అభ్యర్ధులు గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్షలు రాయగా 92 వేల మంది క్వాలిఫై అయ్యారు. ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జులై 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగనుందని తెలిపింది. 

రాష్డ్ర వ్యాప్తంగా 899  పోస్టులకి గత ఏడాది డిసెంబర్ 7న గ్రూప్ -2 నోటిఫికేషన్ జారీ అయింది. ఫిబ్రవరి 25న గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగింది.   త్వరలోనే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.