హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రూప్–2 ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని శంకర్ జీ హాల్లో గ్రూప్-–2 నిర్వహణపై రీజినల్ కోఆర్డినేటర్స్, స్ట్రాంగ్ రూమ్, జాయింట్ కస్టోడియన్స్, పోలీస్ నోడల్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్లు, డీఓ, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, జాయింట్ రూట్ ఆఫీసర్స్ తో కోఆర్డినేషన్మీటింగ్నిర్వహించారు.
కలెక్టర్మాట్లాడుతూ.. జిల్లాలో 48,011 మంది అభ్యర్థులు గ్రూప్–2 రాయనున్నారని, 101 ఎగ్జామ్సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 27 కేంద్రాలను కేటాయించామన్నారు. రెవెన్యూ అడిషనల్ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ ఈ.వెంకటాచారి ఏర్పాట్లను వివరించారు.