TGPSC:గ్రూప్ -2 ఎగ్జామ్ సగం మందే రాసిన్రు

హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రశాంతంగా నిర్వహించారు. ఆదివారం (డిసెంబర్ 15) పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు నిర్వహించారు. మొదటి రోజు కేవలం 46.75 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలు రాశారు. మొత్తం 5లక్షల 51వేల 885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా..74.96 శాతం మంది హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకున్నారు. 

ఆదివారం ఉదయం నిర్వహించిన పేపర్ 1 పరీక్షకు 46.75 శాతం మంది హాజరుకాగా..మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ 2 పరీక్షకు 46.30 శాతం మంది అభ్యర్థులు మాత్ర మే హాజరయ్యారు.ఉదయం రాసిన వారిలో 2,491 మంది పేపర్ -2 రాయకుండానే ఇంటిదారి పట్టారు. మొత్తం మొత్తం రేపు ( సోమవారం) పేపర్3, పేపర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.