డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయండి

ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి 

మక్తల్, వెలుగు: మక్తల్, ఆత్మకూర్​ పట్టణాల్లో డయాలసిస్ సెంటర్ లను  ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వినతిపత్రం అందించారు.  సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రిని కలిసి మక్తల్ నియోజవర్గంలో డయాలసిస్ సెంటర్ లేకపోవడంతో డయలాసిస్‌ రోగులు వంద కిలోమీటర్లు ప్రయాణించి డయాలసిస్ సేవలు పొందాల్సి వస్తోందన్నారు.  

 దీంతో డయాలసిస్ రోగులు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. వెంటనే మక్తల్, ఆత్మకూర్​ పట్టణాల్లో డయాలసిస్ సెంటర్లను ప్రారంభించి, రోగుల ఇబ్బందులు తొలగించాలని విన్నవించారు. అందుకు స్పందించిన మంత్రి వీలైనంత త్వరగా డయాలసిస్ సెంటర్లు ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు.