తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రారంభమైంది. మొత్తం 33 జిల్లాల్లో 1,368 ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. టీజీపీఎస్సీసీ ఆదేశాల మేరకు అరగంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లను మూసేశారు.మొదటిరోజు పరీక్ష ఆదివారం డిసెంబర్ 15 పేపర్ -1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు..పేపర్ -2 మధ్యా హ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. రెండో రోజు పరీక్ష డిసెంబర్ 16 సోమవారంపేపర్ 3 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్ 4 మధ్యా హ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది.
Also Read : ఒరిజినల్ ఐడీ కార్డు ఉంటేనే గ్రూప్-2 ఎగ్జామ్స్కు ఎంట్రీ
ఒక్కో పేపర్ లో 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. గ్రూప్ -2 పరీక్ష నిర్వహణకు 49,843 మంది విద్యాసంస్థల సిబ్బందిని కేటాయించారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది 1,719 మంది పాల్గొన్నారు.అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్ -2 పరీక్షకు భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు చేయనున్నారు. పరీక్ష నిర్వహణకు 6,865 మంది పోలీసులతో భద్రత కల్పించనున్నారు. సీసీ కెమెరాలతో నిఘాలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు తీసుకొచ్చిన హాల్ టికెట్ ను.. గుర్తింపు కార్డును క్షుణ్ణంగా పరిశీలించి.. పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.