గ్రూప్ 1 ఫలితాల ప్రకటనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

గ్రూప్ వన్  ఫలితాలు వెల్లడించేందుకు TSPSC కి హైకోర్టు అనుమతి ఇచ్చింది. రిజర్వేషన్ల విషయంలో గ్రూప్ 1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై  హైకోర్టు విచారణ జరిపింది.  విచారణ అనంతరం  గ్రూప్ 1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేస్తూ.. ఫలితాలు ప్రకటించాలని  టీఎస్ పీఎస్సీకి ఆదేశాలు జారి చేసింది. 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షలను పూర్తి చేసింది.  రిజర్వేషన్ల విషయం తేలేంతవరకు గ్రూపు 1 అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.గ్రూప్‌-1పరీక్షలపై వచ్చిన అభ్యంతరాలకు అర్థం లేదని   హైకోర్టులో అభిప్రాయపడింది.  రిజల్ట్స్ ఆపాలని కోరుతూ  గ్రూప్ 1 అభ్యర్థులు  దాఖలు చేసిన  పిటిషన్‌లపై విచారణ జరిగింది. దీంతో గ్రూప్ 1 అభ్యర్థులకు రిజల్ట్స్ ప్రకటనపై ఉత్కంఠ వీడింది..