ఫ్రాన్స్​ నుంచి బయలుదేరిన భారతీయులు

ఫ్రాన్స్​ నుంచి బయలుదేరిన భారతీయులు

ముంబై : ఫ్రాన్స్‌‌ అధికారులు స్వాధీనం చేసుకున్న 276 మంది భారతీయులు ప్రయాణిస్తున్న విమానం మంగళవారం ముంబైకి చేరుకోనుంది. తెల్లవారుజామున ఒంటి గంటకు ల్యాండ్​అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆ విమానం సోమవారం మధ్యాహ్నమే ముంబైకి చేరుకోవాల్సి ఉన్నా.. ప్రయాణికులను విచారించడంలో జరిగిన జాప్యంతో ఆలస్యమైంది. రొమేనియా సంస్థ లెజెండ్‌‌ ఎయిర్‌‌లైన్స్‌‌కు చెందిన విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌‌ నుంచి నికరాగువాకు బయల్దేరింది. ఫ్యూయల్ నింపడం కోసం గత శుక్రవారం ఫ్రాన్స్‌‌లోని వాట్రీ ఎయిర్‌‌పోర్టులో దిగింది. అప్పటికే మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం అందుకున్న ఫ్రాన్స్‌‌ అధికారులు ఆ విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆదివారం నలుగురు ఫ్రెంచ్ న్యాయమూర్తులు కొందరు ప్రయాణికులను ప్రశ్నించారు. వారిలో కొందరు హిందీ, మరికొందరు తమిళం మాట్లాడినట్లు ఫ్రెంచ్​ ​మీడియా పేర్కొంది. విమానం బయలుదేరేందుకు షెడ్యూల్​ రిలీజ్ ​చేసిన తర్వాత.. న్యాయమూర్తులు మరికొందరు ప్రయాణికులను విచారించే  ప్రక్రియ వాయిదా పడింది. దీంతో విమానం బయలుదేరడం ఆలస్యమైంది.