న్యూఢిల్లీ: గ్రీన్ ఎనర్జీ సప్లయ్ చేసేందుకు హిందాల్కోతో గ్రీన్కో ఒప్పందం కుదుర్చుకుంది. హిందాల్కో ప్లాంట్‌లో 400 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌ను ఈ ఒప్పందం కింద గ్రీన్కో ఏర్పాటు చేస్తుంది. విండ్, సోలార్ రెండూ ఉండే ఈ ప్రాజెక్టు నుంచి విద్యుత్‌ను హిందాల్కో అల్యూమినియం స్మెల్టర్‌కు సప్లయ్ చేస్తామని గ్రీన్కో వెల్లడించింది. ఈ సోలార్, విండ్ ప్రాజెక్టు డిజైన్, నిర్మాణంతోపాటు కొంత మేర నిర్వహణ బాధ్యతలను కూడా తాము చేపట్టనున్నట్లు గ్రీన్కో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని తమ హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులోనే ఈ కొత్త ప్రాజెక్టు కోసం తగిన స్టోరేజ్ కెపాసిటీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. 25 ఏళ్లపాటు హిందాల్కోకు ఈ ఒప్పందం కింద విద్యుత్‌ను సప్లయ్ చేస్తామని గ్రీన్కో పేర్కొంది. తాజా ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనాన్షియల్ డిటెయిల్స్‌ను మాత్రం గ్రీన్కో వెల్లడించలేదు. ఆదిత్య బిర్లా గ్రూప్‌లోని హిందాల్కో ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే రెవెన్యూ పరంగా పెద్ద అల్యూమినియం కంపెనీ.
